![]() |
![]() |

"శ్రీదేవి డ్రామా కంపెనీ" షోలో ఈవారం ఆదిని సెంటరాఫ్ అట్రాక్షన్ గా చేసి గేమ్ ఆడేసుకున్నారు లేడీస్. పాత, కొత్త యాంకర్స్, లేడీ యాక్టర్స్ అంతా వచ్చి ఆదిని కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టారు. హాకీ స్టిక్స్, చీపుర్లు, క్రికెట్ బ్యాట్లు వంటివి తీసుకొచ్చి లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ కోటింగ్ ఇచ్చారు.
ఇక ఆ రోజుల్లో ఫేమస్ యాంకర్ శిల్ప చక్రవర్తి వచ్చి "ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తావా లేదా" అని గట్టిగా అడిగేసరికి "ఆడవాళ్ళకు గౌరవం లేదా..ఎవరన్నారు ఆ మాట. బస్సుల్లో, రైళ్లల్లో స్త్రీలకు మాత్రమే కేటాయించిన సీట్లలో అన్నారు కానీ ఎక్కడైనా పురుషులకు మాత్రమే కేటాయించిన సీట్లు అంటూ మాకు ఒక్క సీటైనా ఇచ్చారా...ఏ అక్కడ ఆడవాళ్ళకు గౌరవం లేదా...భర్త పొతే భార్యకు పింఛన్ వస్తుంది కానీ భార్య పొతే భర్తకు పింఛన్ వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా...అమ్మాయిలను ఎవ్వరైనా అలా కదిలిస్తే షీ టీములు వచ్చేస్తున్నాయి. అబ్బాయిలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎక్కడైనా ఒక్క హీ టీం వచ్చిందా..భార్యను భర్త జస్ట్ చిన్న దెబ్బ కొడితే చాలా భార్య బయటికెళ్లి నానా రచ్చా చేస్తుంది. కానీ భార్య భర్తను కుక్కను కొట్టినట్టు కొట్టినా మళ్ళీ టక్ వేసుకుని నీట్ గా బయటికి వెళ్తాం మా మగాళ్ళం..అక్కడ మీకు గౌరవం లేదా" అని ఆది చెప్పేసరికి "బయట ఆడవాళ్ళకు లైన్ వేయాలి కాబట్టి టక్ వేసుకుని వెళ్తారు మరి" అని ఒక లేడీ ఆర్టిస్ట్ కౌంటర్ వేసింది.

"అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు...ఎందుకు మీకు సారీ చెప్పాలి...నేను డాన్స్ వేస్తా..సాంగ్స్ పాడతా..కామెడీ చేస్తా" అన్నాడు ఆది. "మేము కూడా డాన్స్ చేస్తాం, సాంగ్స్ పాడతాం, కామెడీ చేస్తాం, ఎంటర్టైన్ చేసి నీతో సారీ చెప్పించుకుని వెళ్తాం" అని శపథం చేసింది ఆరియానా.
![]() |
![]() |